hospital | జాజుల నరసింహ గౌడ్‌ను పరామర్శ….

hospital | జాజుల నరసింహ గౌడ్‌ను పరామర్శ….
hospital | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామ గౌండ్ల సంఘం అధ్యక్షుడు జాజుల నరసింహ గౌడ్ ఇటీవల హైదరాబాదు బీఎన్ రెడ్డి నగర్‌లోని విలియంసన్ ఆస్పత్రిలో మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్ తదితరులు ఈరోజు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా నరసింహ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నరసింహ గౌడ్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని,వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్ పేట్ ఇసుక లారీ ఉపాధ్యక్షుడు మునుకుంట్ల బలరాం గౌడ్, శ్రీను గౌడ్, మునుకుంట్ల కుమార్ గౌడ్, మునుకుంట్ల నరసింహ గౌడ్, జాజుల ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు.
