ధర్మవరంలో ఘోరం

శ్రీ సత్యసాయి బ్యూరో, (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం(Dharmavaram)లో రైల్వే స్టేషన్ సమీపాన‌ గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య(murder) చేసి, పారిపోయారు. మృతుడు తలారి లోకేంద్ర, తండ్రి పేరు భైరవుడు(Bhairava) ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ ఎల్-2కు చెందిన వ్యక్తిగా సమాచారం.

తల్లిదండ్రులు బొప్పాయి కాయలు బండి మీద అమ్ముకుంటూ జీవనం(life) సాగిస్తారని తెలిసింది. కాగా మృతుడు గతంలో పలు కేసులలోనూ, ఒక మహిళను(woman) చంపిన కేసులో కూడ నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply