కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన రైతు ఉద్యమకారుడు (పసుపు,ఎర్రజొన్న) సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలేటి మోహన్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

సోమవారం ఉప్లూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏలేటి మోహన్ రెడ్డి నీ శాలువా,పూల మాలతో ఘనంగా సన్మానించి, హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ పర్యవేక్షణ పూర్తిస్థాయిలో జిల్లా కమిటీని నియమించారు.కాగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏలేటి మోహన్ రెడ్డి నీ నియమించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్,పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్,బద్దం రాజేశ్వర్ రెడ్డి, తక్కురి ముత్యం, ఎనేడ్ల గంగారెడ్డి, సుంకరి విజయ్, నరేందర్, బద్దం నగేష్, తిరుపతి రెడ్డి,సాదుల్లా,బైండ్ల శ్రీనివాస్, రాకేష్, నరేష్, ఆంజనేయులు, ఫారూఖ్, సల్మాన్, అనిల్, ఉబేద్,శివరాం యాదవ్, తిరుమలేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply