Honor Cruelity : కూతురు దారుణ హత్య

Honor Cruelity : కూతురు దారుణ హత్య

ప్రేమించటమే ఆమె నేరం

తండ్రిలో దానవుడి దాస్టీకం

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి)

మె ప్రేమను ప్రేమించింది. కులాన్ని ధిక్కరించింది. కన్న తండ్రి అదిరింపులు, బెదిరింపులకు భయపడలేదు. తాను ప్రేమించిన వ్యక్తిని దేవుడి సాక్షిగా పెళ్లాడింది. చట్టం సహకారం తీసుకుంది. కానీ.. పరువు  క్రూరత్వం ( Honor Cruelity )  ముందు ఓడిపోయింది. పరువు పగకు బలైంది. ఈ ఘటన కర్ణాటకలో సభ్య సమాజాన్ని కుంగదీసింది.   కుల దురంహరంతో పరువు హత్య ( Murder) కు దారి తీసిన  ఈ కిరాతక హక్యను జనం ఈసడిస్తున్పారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

Honor Cruelity

ర్ణాటక  హుబ్బళ్లి (Hubballi) లో  పరువు ప్రతిష్ట పేరిట తాను  కన్న కూతురు గర్భవతి అని తెలిసినా..  ఆమెపై తండ్రి దళం పాశవికంగా  దాడి చేయగా .. నిండు గర్భిణీ  చికిత్స పొందుతూ కన్నుమూసింది.  హుబ్బళ్లి పట్టణానికి సమీపంలోని వీరాపుర గ్రామానికి చెందిన (Manya Patil)  మాన్య పాటిల్ (19), వివేకానంద (Vivekananda)   డిగ్రీ చదువుతున్న (Lovers)  సమయంలో ప్రేమించుకున్నారు. వివేకానంద అదే గ్రామానికి (Inaam Veera Pura)    చెందిన దళిత (Dalit Youth)  యువకుడు. మాన్య తండ్రి గౌడ పాటిల్ ఈ ప్రేమ  పెళ్లికి నిరాకరించాడు.   ఆ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమిస్తే తమ  పరువు పోతుందని.. అందరూ చావాల్సిందే అని బెదిరించాడు. కానీ, మాన్య   తన ప్రియుడిని జూన్ 19న ఒక ఆలయంలో (Married in Temple)  పెళ్లి చేసుకుంది.

Honor Cruelity

నంతరం ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మాన్య తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిచి (Police Counselled) రాజీ కుదిర్చారు. కొత్త జంట హవేరీ జిల్లాలో కాపురం పెట్టారు. ఏడు నెలల కాపురానికి ఎలాంటి అవాంతరాలు లేవు. ఈ కుటుంబాల మధ్య మాటా మంతీ లేవు. ఘర్షణలు లేవు.  తన తల్లిదండ్రులు అంతా మర్చిపోయారని మాన్య  భావించింది. ప్రస్తుతం మాన్య (6 Months)  ఆరు నెలల గర్భవతి (Pregnant)  .  హాస్పిటల్‌లో వైద్య పరీక్షల (Medical Tests) నిమిత్తం కొత్త  దంపతులు వీరాపుర గ్రామానికి వచ్చారు.

Honor Cruelity

అత్తామామ వద్ద  మాన్య  ఉన్న విషయం తెలుసుకున్న  మాన్య తండ్రి కోపంతో రగిలిపోయాడు. తన బంధువులు  ( Family Members) వీరన గౌడ,  మహదేవ గౌడ పాటిల్, అరుణ్ గౌడ పాటిల్‌తో వెళ్లి మాన్య అత్తమామ, భర్తపై పైపులు, రాడ్లతో (Raids)  దాడి చేశారు. తన భర్తను, అత్తామామను కొట్టవొద్దని అడ్డు వచ్చిన మాన్యపై కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి (Dead) చెందింది.  భర్త, అత్తమామలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.   నిందితులు అరెస్ట్ చేశారు.

Leave a Reply