అత్యవసర సేవల్లో హోంగార్డుల పాత్ర కీల‌కం : ఎస్పీ వినీత్

అత్యవసర సేవల్లో హోంగార్డుల పాత్ర కీల‌కం : ఎస్పీ వినీత్

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : అత్యవసర సేవల్లో హోం గార్డుల పాత్ర కీల‌క‌మ‌ని ఎస్పీ డాక్ట‌ర్ వినీత్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 63వ హోం గార్డుల ఆవిర్భావ దినోత్సవం (రైజింగ్ డే) ఘనంగా నిర్వహించారు.

పరేడ్ అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ హోం గార్డులతో పరస్పర చర్చ జరిపి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని త్వరితగతిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలక రంగాల్లో హోం గార్డులు పోలీస్ శాఖలో అంతర్భాగంగా నిబద్ధతతో సేవలు అందిస్తున్నారని తెలిపారు. నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్, అత్యవసర సేవల్లో హోం గార్డుల పాత్ర అపారమని పేర్కొన్నారు.

ఉత్తమ సేవలందించిన హోం గార్డులకు ప్రశంస పత్రాలు, మెమోంటోలు అందజేశారు. క్రీడాపోటీ విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, హోం గార్డ్స్ ఇన్‌చార్జ్ ఎస్సై మద్దయ్య, ఆర్ఎస్ఐ శ్వేత త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply