HOME | అయ్యో పాపం…
- షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
- కాలి బూడిదైన పెళ్లి కోసం దాచిన డబ్బు
HOME | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి డిగ్రీ కాలేజీ సమీపంలో బుధవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. క్షణాల్లో ఇల్లు కాలి బూడిదవ్వడంతో, అబ్బాయి పెళ్లి (Mariiage) నిమిత్తం దాచిన డబ్బులు, బంగారం కాలిపోయాయని బాధితులు రోదించారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి నష్టం భారీగా జరిగిందని తెలిపారు.

