History | కల్లూరులో పింఛన్ల పంపిణీ

History | కల్లూరులో పింఛన్ల పంపిణీ

  • హాజ‌రైన ఎమ్మెల్యే గౌరి చరిత రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు

History | కల్లూరు, ఆంధ్రప్రభ : సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లను అమలు చేస్తున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరిత రెడ్డి(MLA Gowri Charitha Reddy) తెలిపారు. ఈ సందర్భంగా కల్లూరు మండలంలోని 78, 79 సచివాలయాల పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

History |

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు, గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. కల్లూరు 78, 79 సచివాలయాల పరిధిలో మొత్తం 10 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. అలాగే రాఘవేంద్ర నగర్ పరిధిలో కూడా 10 మందికి కొత్త పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరి చరిత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 సంవత్సరాల చరిత్ర(History)లో తొలిసారిగా ఒకే రోజులో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి రూ. 2730 కోట్ల మేర పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అవ్వ తాతల చేత శభాష్ అనిపించుకున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని పేర్కొన్నారు.

History |

గతంలో రూ. 200గా ఉన్న పింఛన్లను రూ.2వేల‌కు, ఆపై రూ.4వేల‌కు పెంచి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు భరోసా కల్పించిన ప్రభుత్వం ఇదేనని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాని(Government)కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 78, 79 వార్డుల టీడీపీ నాయకులు శైలజ యాదవ్, శ్రీనివాస రెడ్డి, ఏసు మల్లికార్జున, ఆదాం శ్రీనివాసులు, చిరంజీవి, పుల్లయ్య గౌడ్, నాగమద్దిలేటి మిన్నెల రామకృష్ణ, జయపాల్, చెన్నయ్య రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని నేతలు పేర్కొన్నారు.

History |
History |

Leave a Reply