- కలెక్టర్ సుమిత్ కుమార్
COLLECTOR| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఐరాల మండలంలోని అగ్ర గ్రామం జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులు సహాయ పరికరాల గుర్తింపు కార్యక్రమానికిజిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 20 నుంచి 25 రకాల దివ్యాంగులకు, వృద్ధులకు చెవి సమస్య ఉంటే హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం లేకపోతే ఒక డివైస్ ఇవ్వడం, ఒక వీల్ చైర్ ఇవ్వడం, ఒక స్టిక్ ఇవ్వడం కూడా జిల్లాలో చేయడం, జరుగుతూ ఉందని తెలిపారు.
సుమారుగా 3600 మంది లబ్ధి పొందారు. రూ. 4 కోట్ల 50 లక్షల సబ్సిడీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చారు. ఈసారి కూడా ఈ కౌన్సిలింగ్ చిత్తూరు జిల్లాలో ఎనిమిది చోట్ల జరుగుతున్నాయన్నారు. నిన్న కూడా కార్వేటి నగరంలో పూర్తి చేశారని, గ్రామంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. వృద్ధులకు దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలు గుర్తించి త్వరలో పంపిణీ చేయనున్నామని తెలిపారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం అంగవైకల్యం బారిన పడినటువంటి వారందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం వారికి అవసరమైనటువంటి పరికరాల్ని అందించుడి కోసం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

దివ్యాంగులకు, వృద్ధులకు మనోధైర్యాన్ని నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దివ్యాంగులకు అందరికీ సేవ చేయడం ఇలాంటి వారందరికీ కూడా సహాయం చేయడం అనేది భగవంతుడు మనకు కల్పించినటువంటి గొప్ప వరం అని తెలిపారు సమాజంలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఆదుకుంటే వారిలో కూడా దేవుని చూసుకుంటారు ఈ రోజు ప్రభుత్వం అనేది ప్రజల కోసం ముఖ్యంగా అందరితో సమానంగా బతకడం కోసం వారికి ఉన్నటువంటి అంగ వైకల్యం అనేది వారిలో మానసికంగా ఇబ్బందులు కలగజేయకుండా వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా సమాజంలో అందరితో సమానం బ్రతకడం కోసం ఇలాంటి కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంది.

గత సంవత్సరం దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి వినికిడి యంత్రాలు గాని వీల్ చైర్లు గాని బ్యాటరీ సైకిల్ గాని సపోర్టింగ్ స్టిక్స్ గాని ఇంకా కంటి అద్దాలు గాని రకరకాల అయినటువంటి సమస్యలకి పరిష్కారాన్ని చూపించే పరికరాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ పీడీ విక్రమ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు , కార్యదర్శి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

