High funding | ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా

High funding | ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా
- ప్రచారంలో దూసుకుపోతున్న అర్షనపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థి
- అర్షనపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సిద్ధ సంతోష్
High funding | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : సిద్ధ సంతోష్ గ్రామ ప్రజలు ఆదరించి లేడీస్ పర్స్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే అర్షనపల్లి గ్రామానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామానికి అధిక నిధులు(High funding) తీసుకొచ్చి గ్రామంలోని గత ప్రభుత్వం చేయని మిగిలిన పనులను పూర్తి చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి, సిద్ధ సంతోష్ ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు.
గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో దొంతి మాధవ రెడ్డి ఆశీస్సులతో అర్షన పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా, గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడి గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు డ్రైనేజీ పనుల తోపాటు, అర్హులైన వారికి పెన్షన్స్ ఇందిరమ్మ ఇళ్ల, మహిళా సంఘాలకు పావుల వడ్డీకే రుణాలు ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ద్దేవ చేశారు.
