నంద్యాల బ్యూరో, ఏప్రిల్ 28 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో సోమవారం హైకోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలంలోని మల్లన్న స్వామి గుడికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు.
దేవాలయంలోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం పూజా కార్యక్రమాలతో పాటు గర్భగుడి దర్శనాన్ని చేపట్టారు. అనంతరం మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని న్యాయమూర్తికి సమర్పించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.