సర్పంచ్ సస్పెన్షన్ తోసి పుచ్చిన హైకోర్టు..

సర్పంచ్ సస్పెన్షన్ తోసి పుచ్చిన హైకోర్టు..
త్వరలో తిరిగి బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్ వరి శ్రీదేవి
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : పంచాయతీ నిధులు దారి మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ గురైన రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి సస్పెన్షన్ను తోసి పుచ్చిన హైకోర్టు. సర్పంచ్ వరి శ్రీదేవి పంచాయతీ నిధులు దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు విచారించి జిల్లా కలెక్టర్ నివేదిక అందించడంతో సర్పంచ్ను జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో సర్పంచ్ శ్రీదేవి హైకోర్టును ఆశ్రయించగా సర్పంచ్ సర్పంచ్ సస్పెన్షనుకు సరైన కారణాలు చూపకపోవడం తో సస్పెన్షన్పూ తోసి పుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో సర్పంచ్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
