High Court | విచారణ వాయిదా…

High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణను వాయిదా వేసింది. సీసీఎస్ లో నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఐబొమ్మ రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు.
