Hero yash | యశ్ ఇప్పుడు ఏం చెబుతాడు..?

Hero yash | యశ్ ఇప్పుడు ఏం చెబుతాడు..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేజీఎఫ్‌ మూవీతో.. సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యష్‌. ఆతర్వాత చాలా కథలు విని ఫైనల్ గా టాక్సిక్ అనే భారీ పాన్ ఇండియా మూవీ (Pan India Movie) చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. అయితే.. కేజీఎఫ్ తర్వాత లేడీ డైరెక్టర్ తో వర్క్ చేయడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత వివాదస్పదం అవ్వడం తెలిసిందే. ఇప్పుడు యశ్ చేసిన పాత కామెంట్స్ పై కొత్తగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇంతకీ.. యశ్ చేసిన కామెంట్స్ ఏంటి..?

Hero yash

Hero yash | యశ్ ఇలా చేయడం ఏంటి…?

యశ్ నటిస్తున్న టాక్సిక్ మూవీ నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో చూపించిన ఓ సీన్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇంతకీ ఆ సీన్ లో ఏముందంటే.. యశ్ కారులో ఒక అమ్మాయితో సెక్స్ చేస్తున్నట్టుగా చూపించారు. ఇది ఎవరూ ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే.. ఈ టీజర్ (Teaser) చూసిన జనాలకు ఇది షాకింగ్ గా అనిపించింది. పాన్ ఇండియా స్టార్ ఇలాంటి సీన్ లో నటించడమా..? అది కూడా ఓ లేడీ డైరెక్టర్ ఈ సీన్ ని తీయడమా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. టీజర్ లో ఇంత బోల్డ్ సీన్స్ పెట్టడం పై కర్నాటకలో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది.

Hero yash

Hero yash | యశ్.. ప్రామిస్ ఏమైంది…?

ఇదిలా ఉంటే.. యశ్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను ఎలాంటి కథలు, ఎలాంటి సీన్లకి దూరంగా ఉంటానో చెప్పాడు. నా తల్లిదండ్రులతో కలిసి చూడటానికి నేను ఇబ్బంది పడే సన్నివేశాల్లో నేను నటించను. వాటిని ఒప్పుకోను.. అని అన్నాడు యశ్. అంతే కాదండోయ్ ఇది నా ప్రామిస్ అని కూడా అన్నాడు. దాంతో ఇప్పుడు యశ్ (Yash) ని ట్రోల్ చేస్తున్నారు. ఆ సీను మీ తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో హాల్లో పెద్ద స్క్రీన్ మీద చూస్తావా అని అడుగుతున్నారు. ఇక ఆ సీన్లో నటించిన విదేశీ హీరోయిన్ అయితే.. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో తన అకౌంట్ ని డీయాక్టివేట్ చేసింది. ఆమెకి అంత ట్రోలింగ్ సెగ తగిలింది. మార్చి 19న టాక్సిక్ రిలీజ్ కానుంది. మరి.. సినిమాలో ఈ సీన్ ఉంచుతారో తీసేస్తారో చూడాలి.

Hero yash

CLICK HERE TO READ బన్నీ నెక్ట్స్ కాన్సెప్ట్ ఏంటి..?

CLICK HERE TO READ MORE

Leave a Reply