సోషల్ మీడియాలో నకిలీ ఐడీలు

సోషల్ మీడియాలో నకిలీ ఐడీలు
- నకిలీ లింక్‌లు, చాటింగ్‌లు నమ్మవద్దు
- సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్ లింక్‌లతో అప్రమత్తంగా ఉండాలి
- ప్రజలు నమ్మి మోసపోవద్దు
- కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఐఏఎస్
ఖమ్మం, ఆంధ్రప్రభ : సాంకేతికతను వినియోగించుకొని కొందరు నకిలీ ఫేక్‌బుక్ ప్రొఫైల్‌లను తయారు చేసి ప్రజలను మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య (ఐఏఎస్) అన్నారు. కార్పొరేషన్ పేరు మీద గాని కమిషనర్ పేరు మీద గాని ఏ ఇతర అధికారుల పేరు మీద ఎటువంటి ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లు, ఫేస్‌బుక్ అకౌంట్లు, ఐడీలు ఉండవని ప్రజలు దీనిని గమనించాలని పేర్కొన్నారు. కొందరు కావాలనే కార్పొరేషన్ అధికారుల పేరు మీద నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించి ప్రజలను మోసగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని కార్పొరేషన్‌కు సంబంధించి ఎటువంటి ఫేస్‌బుక్ ప్రొఫైల్ లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
తమ పేరు మీద నకిలీ ఐడీలు తయారు చేసి ప్రజలను మోసగిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సిద్ధమని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పన్నులు చెల్లించే ప్రజలు కార్పొరేషన్ అధికారులు సూచించిన విధంగానే పన్నులు చెల్లించాలని ప్రజల సౌకర్యార్థం కోసం కార్పొరేషన్ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా ఈ నకిలీ ఫేస్‌బుక్ ఐడీల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు చెప్పే ప్రకటనలు, ఆఫర్లను నమ్మి మోసపోవద్దని లింక్‌లు పంపించిన వారితో చాటింగ్‌లు చేసి నష్టపోవద్దని కమిషనర్ అన్నారు.
నేరుగా కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించి ఏదైనా సమస్యలుంటే కార్పొరేషన్ అధికారులకు తెలపాలని దళారులు, మధ్యవర్తులను సైతం నమ్మొద్దని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ ప్రొఫైల్ పట్ల ప్రస్తుత సమయంలో పన్నులు చెల్లించే వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ప్రజల కోసం హెల్ప్ డెస్క్ :
కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం కార్పొరేషన్ ప్రధాన ద్వారం దగ్గరే సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని పన్నులు చెల్లించేందుకు వారు అన్ని విధాలా సహకరిస్తారని కేవలం ప్రజల సౌకర్యార్థమే వారిని ఏర్పాటు చేసి ప్రజలకు మరింత సేవలను ఖమ్మం కార్పొరేషన్ అందిస్తుందని ప్రజలు కార్పొరేషన్‌లోని హెల్ప్ డెస్క్‌లోని సేవలను వినియోగించుకోవాలని వినియోగించుకోవాలని కోరారు. నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ ద్వారా వచ్చే లింక్‌లను చెల్లింపులు చేయకూడదని కార్పొరేషన్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌లో పన్నులు చెల్లించాల్సిన వారికి సిబ్బంది దగ్గరుండి వారి సహాయ సహకారాలు అందిస్తారని దీనిని వినియోగించుకోవాలని కోరారు.
కార్పొరేషన్ సిబ్బంది సైతం ప్రజలకు అందుబాటులో ఉన్నారని వారిని సంప్రదించాలని పేర్కొన్నారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ పేరిట సృష్టించబడిన ఒక నకిలీ (ఫేక్) ప్రొఫైల్ ప్రస్తుతం ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు- మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామన్నారు. సదరు నకిలీ ప్రొఫైల్ ”మున్సిపల్ కమిషనర్ అభిషేక్ కార్పొరేషన్ ఆఫీస్” అనే పేరుతో ట్రూ కాలర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది.
మోసం: ఈ నకిలీ అకౌంట్ ద్వారా అపరిచిత వ్యక్తులు మీకు మెసేజ్ చేయవచ్చు లేదా ఫోన్ చేసి అత్యవసరమని చెప్పి డబ్బులు పంపమని అడగవచ్చు. వాస్తవం: ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ కూడా వ్యక్తిగత కారణాల కోసం లేదా అధికారిక పనుల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ డబ్బులు అడగరు.
ప్రజలకు సూచనలు:
డబ్బులు పంపవద్దు: ఎవరైనా అధికారి పేరుతో ఫోన్ చేసి డబ్బులు అడిగితే వెంటనే స్పందించవద్దు. ఎటు-వంటి ఆన్‌లైన్ పేమెంట్స్ (గుగూల్ పే, ఫోన్ పే) చేయవద్దు.
