Help desk | ఎన్నికల హెల్ప్ డెస్క్ కీలకంగా పనిచేయాలి..

Help desk | ఎన్నికల హెల్ప్ డెస్క్ కీలకంగా పనిచేయాలి..

Help desk | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్ర పరిధిలో అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు.

హెల్ప్ డెస్క్ సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలను ఆయన అందజేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు హెల్ప్ డెస్క్ పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన చెప్పారు. తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, దూడల వెంకటేష్, వార్డ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply