మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెన్నారెడ్డి
అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన పదో తరగతి మిత్ర బృందం
మక్తల్,ఆంధ్రప్రభ : మక్తల్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన దండు చెన్నారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, వారిలో భరోసా నింపేందుకు పాత మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. 2004-05 ఎస్ఎస్సి బ్యాచ్‌కు చెందిన చెన్నారెడ్డి అకాల మరణం వారి స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో అదే బ్యాచ్‌కు చెందిన మిత్రులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో మరణించిన మిత్రుని నివాసానికి చేరుకున్న స్నేహితులు, బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి ధైర్యం చెప్పారు.అనంతరం తమ వంతు సహాయంగా సేకరించిన రూ. 50వేలు నగదును చెన్నారెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో అండగా నిలిచిన స్నేహితుల చొరవను పలువురు అభినందించారు.
స్నేహం అంటే కేవలం సరదాగా గడపడమే కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన బంధమని ఈ సందర్భంగా పదవ తరగతి మిత్ర బృందం చాటిచెప్పారు.
