Helicopter Crash | ఉత్త‌రాఖండ్ లో కుప్ప‌కూలిన హెలికాఫ్ట‌ర్ – ఏడుగురు దుర్మ‌ర‌ణం

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ (Dehradun ) నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు (Kedranath) ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ (Helicopter ) మార్గమధ్యంలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు భ‌క్తుల‌తో (Devotees ) పాటు పైలెట్ మ‌ర‌ణించారు.

ఆర్యన్‌ ఏవియేషన్‌కు (Aryan Aviation ) చెందిన హెలికాప్టర్‌.. కేదార్‌నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తున్నది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపుతప్పిన హెలికాప్టర్‌ గౌరీకుండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో పైలట్‌తోపాటు ఓ చిన్నారి కూడా ఉంది . ప్రమాద సమయంలో ద‌హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు, పైలట్‌ ఉన్నారు.

ఉత్తరాఖండ్ శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) డాక్టర్ వి. మురుగేశన్ వెల్లడించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలెట్, మ‌రో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని ఆయన ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణం, భౌగోళిక పరిస్థితుల నడుమ ఈ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Leave a Reply