శ్రీశైలం జలాశయంలోకి భారీగా నీరు
- పూర్తిస్థాయి నీటిమట్టం.. 885 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులు
నంద్యాల, ఆంధ్రప్రభ : శ్రీశైలం జలాశయానికి రోజు రోజుకు వరద నీరు పెరుగుతూ వస్తుంది. తుఫాన్ ప్రభావం వల్ల ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత 20 రోజులుగా గేట్లను మూసివేశారు. ఈ రోజు సాయంత్రం శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసేందుకు అధికారులు సైరన్(Siren) మోగించారు. మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ ఏడాది 8వ సారి శ్రీశైలం గేట్లు(risailam gates) ఎత్తనున్న అధికారులు. అందుకు గురువారం సాయంత్రం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శ్రీశైలం జలాశాయాని(eservoir)కి 54,821 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇందులో జూరాల ప్రాజెక్టు 29,388 క్యూసెక్కుల నీరు సుంకేసుల నుంచి 24,308 క్యూసెక్కుల నీరు, హంద్రీ నుంచి1125 క్యూసెక్కుల నీరు(1125 cusecs of water) జలాశయంలోకి వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 884.50 అడుగులకు నీరు చేరుకుంది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.9198 టీఎంసీలుగా జలాశయంలో ఉన్నాయి. జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి(power generation)కి 57,996 క్యూసెక్కుల నీటి నీవినియోగిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి విద్యుత్ ఉత్పత్తికి 22,681 క్యూసెక్కులతో నీటిని వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. అత్యధిక వర్షపాతం నమోదు కావటం విశేషం. శ్రీశైలంలో ఒక్క రోజుల్లో 286.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావటం విశేషం.

