Heavy Rains | నెల్లూరులో.. భారీ వర్షాలు
- జాతీయ రహదారిపై నిలిచిన నీరు..
- స్థంభించిన ట్రాఫిక్, తప్పని ఇబ్బందులు..
Heavy Rains| నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : దిత్వా తుఫాను కారణంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గత నాలుగు రోజులు(Four days)గా కురుస్తున్న భారీ వర్షాలు(Heavy rains) బుధవారం కూడా కొనసాగాయి. మంగళవారం మధ్యాహ్నం కొంత విరామం ఇచ్చినప్పటికీ రాత్రి నుంచి భారీ వర్షాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. నెల్లూరు నగర శివార్లలో ఉన్న జాతీయ రహదారి పై(On the National Highway) నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది.

Heavy Rains | అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ
దీంతో వాహనాలు వెంకటాచలం వరకు ఎక్కడికక్కడే(Anywhere) ఆగిపోయాయి. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మరో వైపు అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా(Himanshu Shukla) అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలలో పెన్నానది పరీవాహక ప్రాంతాలలో మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాల(Safe areas)కు తరలించాలని ఆదేశించారు.

