Health Center | 010 అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి..

Health Center | 010 అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి..
Health Center | మంథని, ఆంధ్రప్రభ : మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(Health Center), మాత శిశు సెంటర్ లో సామూహిక వినతిపత్రం బుధవారం సమర్పించారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల వేతనాలను 010 అకౌంట్ ద్వారా చెల్లిందాలని, అలాగే వైద్య విధాన పరిషత్ ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతా శిశు సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్ డా.వి.రాజశేఖర్ కు ఉద్యోగులు సామూహిక వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ సంకల్పంలో భాగంగా సెకండరీ హెల్త్(Secondary Health) సర్వీసెస్ బలోపేతం చేయడానికి అవసరమైన సిబ్బంది సంఖ్యను ప్రతిపాదించాలని కూడా ఉద్యోగులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.
