ఆయన అప్పుల కుప్పగా మార్చాడు..
- ఈకూటమి ప్రభుత్వం
- అభివృద్ధి..సంక్షేమంతో
- రాష్ట్రాన్ని గాడిలో పెడ్తోంది
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
(ఆంధ్రప్రభ, గుడివాడ) : రాష్ట్రాభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) నిర్విరామంగా పనిచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారని, ప్రజా ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం నినాదాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Gudivada MLA Venigandla Ramu) అన్నారు. రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు ఒకటో తేదీ కల్లా నగదు అందిస్తున్నామనీ, పెన్షన్ నగదును లబ్ధిదారుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో జగన్ (Jagan) బటన్ నొక్కుతున్నాననంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశారన్నారు. పేదల ముఖంలో నవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చెప్పారు.
గుడివాడ (Gudivada) పట్టణం 24వ వార్డులోనీ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ఉదయం పంపిణీ చేశారు. వార్డులోని లబ్ధిదారుల ఇళ్లకు వెళుతూ… పింఛన్ నగదును అందజేశారు. లబ్ధిదారులతో, పాటు స్థానిక ప్రజలతో మాట్లాడారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యం ప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల (Welfare programs) పై హర్షం వ్యక్తం చేస్తూ… స్థానిక ప్రజానీకం ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, 24వ వార్డు టిడిపి నాయకులు పండ్రాజు సాంబశివరావు, ఆరవ మురిగేష్, మణికంఠ, స్వామి, రాము, రమణ, ఆనంద్,సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.