ఇక ఈయనే సీపీఐ నేషనల్ కార్యదర్శి…

ఇక ఈయనే సీపీఐ నేషనల్ కార్యదర్శి…

  • సీపీఐ విసిరిన బీసీ కార్డు
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య

ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి : భారత కమ్మూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా .. కె.రామకృష్ణ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్నారు. రామకృష్ఱ స్థానంలో కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్యను ఏపీ సీపీఐ కార్యదర్శిగా భారత కమ్యూనిస్టు పార్టీ నియమించింది.

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో సీపీఐ నీరుగారిన వేళ.. సీపీఐ ఉనికికే ప్రమాదం ఏర్పడిన వేళ.. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ..బీసీ నేత రామకృష్ణ సీపీఐకి ఊపిరూదారు. రాష్ట్ర విభజనకు సీపీఐ తొలుత అంగీకరించటంతో ఆంధ్రప్రజలు సీపీఐపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న వేళ.. పార్టీ కేడర్ కు దిక్కుతోచని స్థితిలో.. రామకృష్ణ పగ్గాలు అందుకున్నారు.

సీపీఐ రథాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. సామాజిక న్యాయం యాత్రతతో 175 నియోజకవర్గాల్లో పర్యటించి సీపీఐ వాణిని వినిపించారు. సీసీఎంతో కలసి మరో యాత్రకు నడుము బిగించారు. ఈ రెండు యాత్రలతో సీపీఐని జనానికి దరి జేర్చారు.

2014 మే నుంచి బాధ్యతలు చేపట్టిన రామకృష్ణకు వరుసగా మూడు పర్యాయలుగా అవకాశం దక్కింది. సీపీఐ పార్టీ నిబంధనల ప్రకారం… 3 పర్యాయాలు దాటితే కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే… ఈసారి గుజ్జుల ఈశ్వరయ్యకు అవకాశం దక్కింది.

కొత్త కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు… ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. ఇటీవల చండీగడ్ లో జరిగిన జాతీయ మహాసభల నేపథ్యంలో.. ఓ బీసీ నేతను జాతీయ కార్యదర్శిగా సీపీఐ ప్రకటించటం విశేషం.

ఓ వైపు బీసీ కార్డుతో బీజేపీ ఎన్నికల యాత్రలకు సిద్ధమవుతున్న తరుణంలో.. సీపీఐ కూడా బీసీ నేతకు రథసారధి పాత్ర అప్పగించటం విశేషం. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఏఐ ఎస్ ఎఫ్ జాతీయ నాయకుడిగా అనేక విప్లవ ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

కడప జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. దూకుడులో ఎక్కడ తగ్గని ఈశ్వరయ్యకు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కటంతో.. ఆనాటి తరం హ్యపీ హ్యాపీగా .. హర్షం వ్యక్తం చేస్తోంది. కడప జిల్లాకు చెందిన గుజ్జుల ఈశ్వరయ్య… సీపీఐ పార్టీ అనుబంధ సంఘం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, రైతు సంఘం నాయకుడిగా పని చేశారు.

ఇప్పటి వరకు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను రామకృష్ణ చూశారు. 2014 మే నుంచి బాధ్యతలు చేపట్టిన రామకృష్ణకు వరుసగా మూడు పర్యాయలుగా అవకాశం దక్కింది. సీపీఐ పార్టీ నిబంధనల ప్రకారం… 3 పర్యాయాలు దాటితే కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే… ఈసారి గుజ్జుల ఈశ్వరయ్యకు అవకాశం దక్కింది. కొత్త కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు… ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు.

Leave a Reply