Hastinapuram | ముగ్గురు మృతి..

Hastinapuram | ముగ్గురు మృతి..

Hastinapuram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని సాగర్ రోడ్ హస్తినాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతిచెందగా, విద్యార్థులు ఆందోళనకు దిగారు.

సాగర్ రోడ్ హస్తినాపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనాన్ని, అలాగే రోడ్డుపై నడిచి వెళ్తున్న యువకుడిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ ఈసీఈ విభాగానికి చెందిన విద్యార్థులు శివ, సందీప్ మృతిచెందారు.

అదేవిధంగా రోడ్డుపై నడిచి వెళ్తున్న మరో యువకుడు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ కళాశాల విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply