ఉమ్మడి మండలాల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

ఆళ్లపల్లి/గుండాల, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మండలాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రామాలయ కళ్యాణ వేదిక దాతలు గౌరిశెట్టి నాగభూషణరావు, భారతమ్మ, శ్రీనివాసరావు, విజయలలిత తెలిపారు.

భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని ప్రజలతో పాటు ఉమ్మడి గుండాల, ఆళ్లపల్లి మండలాల ప్రజలు శ్రీరాముని ఆశీస్సులతో సుఖసంతోషాలతో, శాంతి-సౌభాగ్యాలతో వర్థిల్లాలని వారు ఆకాంక్షించారు.

ఉమ్మడి మండలాల్లోని ప్రధాన పంచాయతీలైన గుండాల, సాయనపల్లి, శెట్టిపల్లి, అనంతోగు, మర్కోడు పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు మరింత వైభవంగా నిర్వహించి, ప్రతి గ్రామానికి కొత్త శోభను తీసుకురావాలని కోరుకున్నారు.

సీతారాముల కృపతో ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు నిండాలని, రాములవారు అందరినీ కాపాడాలని ప్రార్థించారు. మండలాల ప్రజల క్షేమమే తమ లక్ష్యమని పేర్కొంటూ మరోసారి శ్రీరామనవమి, శ్రీరామకళ్యాణ వేడుకల శుభాకాంక్షలను గౌరిశెట్టి నాగభూషణరావు, భారతమ్మ, శ్రీనివాసరావు, విజయలలిత, రాధా-శివాజీ దంపతులు తెలియజేశారు.

Leave a Reply