ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు..

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో జరిగిన రంజాన్ వేడుకల్లో ఉట్నూర్ మాజీ ఎంపీపీ పంద్రా జైవంతరావ్, బి ఆర్ ఎస్ వి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నమాజ్ చేయగా అక్కడికి వెళ్లి వారికి కలిసి ఆ లింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సలీమొద్దీన్, బి ఆర్ ఎస్ నాయకులు కాటం రమేష్, కేంద్రే రమేష్, కొమ్ము విజయ్, పడిదేం శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.
