మతసామరస్యాన్ని చాటుకున్న దంతన్ పల్లి ఉప సర్పంచ్ దంపతులు

మతసామరస్యాన్ని చాటుకున్న దంతన్ పల్లి ఉప సర్పంచ్ దంపతులు
హనుమాన్ దీక్ష స్వాములకు అల్పాహారం అందజేత
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దంతన్ పల్లి గ్రామపంచాయతీఉప సర్పంచ్ మహ్మద్ ముబీన్ దంపతులు ఆదివారం హనుమాన్ దీక్షా స్వాములు పాదయాత్రగా కొండగట్టుకు క వెళ్తున్న దీక్షా స్వాముల విషయాన్ని తెలుసుకుని, వారికి అల్పాహారం, చల్లటి మంచినీరు, పండ్లు అందజేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ ముబీన్ మాట్లాడుతూ, పాదయాత్ర విజయవంతంగాపూర్తిచేసుకుని భక్తులు సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. గ్రామ పంచాయతీ బాగు కోసం ప్రార్ధించాలని సూచించారుమార్గమధ్యంలో ఏవైనా ఇబ్బందులు కలిగితే తనకు తెలియజేయాలని కోరారు.
