Hansika Motwani | ఆ పోస్టులు తొలగించాలని కోర్టు ఆదేశం

Hansika Motwani | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినీ నటి హన్సిక కుటుంబ వివాదం కోర్టు వరకు చేరింది. తన వదిన నాన్సీ జేమ్స్‌పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

సినీ నటి హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్‌పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆమె కోర్టులో పేర్కొన్నారు.

నాన్సీ జేమ్స్ గతంలో సోషల్ మీడియా వేదికగా గృహహింస, మానసిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే, డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే నాన్సీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హన్సిక వాదించారు. ఈ కేసును విచారించిన కోర్టు నాన్సీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.

హన్సిక కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేయవద్దని, సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద వీడియోలను తొలగించాలని సూచించింది. ఇక హన్సిక సోదరుడు ప్రశాంత్ కూడా తన భార్య ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. ఈ కుటుంబ వివాదంపై కోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో ఆసక్తిగా మారింది.

Leave a Reply