handed over | అదృశ్యం కథ సుఖాంతం

handed over | అదృశ్యం కథ సుఖాంతం
- 3 గంటల్లోనే యువకుడి ఆచూకీ లభ్యం
- క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత
handed over | విజయవాడ,ఆంధ్రప్రభ : ఇంట్లో అలిగి సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి విజయవాడకు వచ్చిన యువకుడిని ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసులు కేవలం మూడు గంటల వ్యవధిలో గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబును ఆశ్రయించారు. తల్లిదండ్రుల సమాచారం అందగానే టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ సిబ్బందితో కలిసి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ నగరంలోని సీసీ కెమెరాలు, ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక 250 సీసీ కెమెరాల ఆధారంగా యువకుడి కదలికలను గుర్తించారు. బస్ స్టాండ్ పరిసరాల్లో యువకుడిని గుర్తించిన పోలీసులు అతడిని క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అతి తక్కువ సమయంలో చాకచక్యంగా స్పందించి యువకుడిని కాపాడిన పోలీస్ సిబ్బందిని నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు అభినందించారు.
