గాలివాన బీభత్సం.. రైతులకు అపార నష్టం

గాలివాన బీభత్సం.. రైతులకు అపార నష్టం
నేలకొరిగిన మొక్కజొన్న, జొన్న
పంటలు నేలకొరగడంతో దిగులు చెందుతున్న రైతులు
కుంటాల,ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షానికి సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించడంతో పంటలు పెద్ద మొత్తంలో నేలకొరిగాయి. దీంతో కుంటాల మండల వ్యాప్తంగా లింబకే, అందాకుర్, కల్లూర్, ఓలా గ్రామాలతో పాటు ఆయ గ్రామాల్లోని పంటలు నేలకొరగడంతో ఈదురుగాలు ఉధృతంగా వీచించడంతో మొక్కజొన్న పంటతో పాటు జొన్న, నువ్వు పంటలు సైతం నేలకొరిగాయి.
వరి పంట సైతం నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా మామిడి రైతులు సైతం గాలివాన బీభత్సానికి మామిడి కాయలు నేలరాలిపోయాయి. పంటలు ఆరుగాలం శ్రమించి చేతికి వచ్చే సమయంలో రైతన్నలకు కంటతడి పెట్టించింది. చేతికి నాలుగు రూపాయలు అందే సమయంలో గాలివాన బీభత్సం సృష్టించడంతో పెద్ద మొత్తంలో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించేందుకు కృషి చేయాలని రైతులు వాపోతున్నారు.

దాదాపు మండలంలోని ఓ రైతుకు మూడు నుంచి నాలుగు ఎకరాలకు పైగా మొక్కజొన్న, జొన్న పంటలు నేల కొరిగిపోయాయి. దీంతో కష్టపడి పండించిన పంటలు కంటి ముందే నెలకువడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పంట సర్వేను నిర్వహించి రైతులకు నష్ట పరిహారం అందే విధంగా ప్రభుత్వానికి నివేదించాలని రైతులు వాపోతున్నారు.


