H-1B visa | వీసాల కత్తి ఝళిపిస్తున్న ట్రంప్

H-1B visa | వీసాల కత్తి ఝళిపిస్తున్న ట్రంప్
H-1B visa | ఆంధ్రప్రభ : విదేశీ వృత్తి నిపుణులకు రష్యా మూడేళ్ళపాటు సరికొత్త వీసాను ఇస్తుంటే, అమెరికా హెచ్-1బీ వీసాల ఇంటర్వూలను రద్దు చేస్తున్నట్టు అమెరికన్ ప్రభుత్వం(American government) ప్రకటించింది. హెచ్-1బీ వీసా అప్రూవల్స్ పది సంవత్సరాల కనిష్టానికి తగ్గడం, డిసెంబర్ ఇంటర్వ్యూ స్లాట్స్ రద్దు చేయడం అమెరికా సందర్శించాలనుకున్నవారికీ, అక్కడ విద్యాభ్యాసం కొనసాగించాలనుకున్నవారికి అశనిపాతం లాంటి వార్త. భారత దేశం నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) సరికొత్త అస్త్రాన్ని సంధిస్తున్నారు. ఫీజును ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచడం వల్ల ఇప్పటికే వీసాలు పొందడం చాలా క్లిష్టతరం అవుతోంది. హెచ్ -1బీ వీసాల కోసం దరఖాస్తులు ఎక్కువగా భారతీయుల నుంచే వస్తున్నాయి. భారతీయులపై ఆంక్షలు విధించడం ట్రంప్ ముఖ్యోద్దేశ్యం. సోషల్ మీడియా ఖాతాలను బహిరంగ పర్చాలన్న నిబంధన కూడా భారతీయులకు(For Indians) ఇబ్బందికరమైనదే. సాధ్యమైనంత వరకూ హెచ్-1బీ వీసాలను తగ్గించేందుకే ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోం ది. వీసాల అప్రూవల్స్ తగ్గించడం వల్ల భారతీయ టెక్ కంపెనీలకు గడ్డు కాలం వంటిదే.
