Guruswamas | అయ్యప్పనామస్మరణతో పులకించిన సామానుర్

Guruswamas | అయ్యప్పనామస్మరణతో పులకించిన సామానుర్


వైభవంగా శ్రీఅయ్యప్పస్వామి పడిపూజోత్సవం

Guruswamas | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమీన్పూర్ (Ameenpur) గ్రామపంచాయతీ శివారు గ్రామమైన సామనూర్ లో ఇవాళ‌ గురుస్వాములు మేకలి భగవంతు, రఘువీర్ శంకర్ భానుచందర్ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం నరసింహ కన్నె సామి నివాసంలో వైభవంగా నిర్వహించారు. పడిపూజ పురస్కరించుకొని స్వామివారికి చందనం కుంకుమ పసుపు విభూతి అభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాన్ని చేపట్టారు.

ఈసందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ… గ్రామ గ్రామంలో అయ్యప్ప మాలధారణ చేపట్టి ప్రతి ఇంటి నుండి అయ్యప్ప మాల వేయించాలన్నారు. జీవితంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా శబరియాత్ర అయ్యప్ప మాలధారణ చేసి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు వెంకట్ రాములు (Venkat Ramulu) ముద్దం రాము, పోర్ల నర్సింహులు, సందీప్, బాలాంజనేయులు, బడుకల్ నరసింహులు, నారికేల గురుస్వామి కథలప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply