సినీ నటుడు పోసాని కృష్ణ మురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై గుంటూరు సీఐడీ కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తుది తీర్పును ఈ నెల 21కి వాయిదా వేసింది.
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు జిల్లా జైలులో పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యి నేటితో 21 రోజులు పూర్తి అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 16 కేసులు నమోదు అయ్యాయి.