AP | గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

వెల‌గ‌పూడి : హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని జ‌న‌సేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదన చెందానన్నారు. బాధిత కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Leave a Reply