Guarantee Scheme | నిజాలు నిగ్గు తేలేనా..!

Guarantee Scheme | నిజాలు నిగ్గు తేలేనా..!
- ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
- బాల్కొండ మండలంలో సోమవారం నుండి ప్రారంభమైన తనిఖీలు
- విఎస్ఏ ల తోనే తనిఖీలు
Guarantee Scheme | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం(Employment Guarantee Scheme) ద్వారా ఒక ఆర్థిక సంత్సరంలో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలు సోమవారం నుండి నిర్వహిస్తున్నారు. మండల పరిధిలో పది గ్రామ పంచాయతీల్లో 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2025 వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. గ్రామాల్లో సామాజిక తనిఖీలు చేపట్టడా నికి బృందాలు ఏర్పాడ్డాయి.
మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో ఒక ఎస్ఆర్పీ, 8 మంది డిఆర్పీలు 16 మంది వీఎస్ఏలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలో రూ.2 కోట్ల 65 లక్షల 64 వేల 745 రూపాయలతో సుమారుగా 111పనులను చేపట్టారు.ఈ నిధులతో గ్రామాలలో డంపింగ్ యార్డులు,శ్మశాన వాటికలు నిర్మించారు. సిమెంట్ రోడ్లు కూడ వేశారు. కానీ పనుల్లో ఎంత మేర నాణ్యత ప్రమాణాలు పాటించారో,పనులు సక్రమంగా చేపట్టారో లేదో తేల్చాల్సి ఉంది.
సామాజిక తనిఖీ సక్రమంగా జరు గుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. తనిఖీల్లో నిజాలు బయట పెట్టే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ గత సంవత్సరంలో ఉపాధి హమీ పథకంలో పంచాయతీ కార్య దర్శులు, ప్రత్యేక పాలనాఅధికారులు కలిసి పనులు చేపట్టారు.కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు ఇప్పుడే కనిపించకుండా పోతున్నాయి. ఎలాంటి పనులు చేపట్టారో వారికే అర్థం కాని పరిస్థితిలో కొందరు ఉన్నారు.
ఉపాధి హమీ పథకం ద్వారా చేపట్టిన పను లను ఎస్ఆర్పీ ఆధ్వర్యంలో డీఆర్పీలు, వీఎస్ఏలు చేపడుతారు, కానీ వీఎస్ఏ లు నిపుణులు కారనే విమర్శలు వచ్చాయి.కళాశాలలో చదివే విద్యార్థులతో, నిరుద్యోగులను తాత్కాలికంగా వీఎస్ఎలుగా నియమించుకొని తనిఖీలు చేస్తున్నారు. నిపుణులతో ఆడిట్ నిర్వహిస్తే లోపలు బయట పడే అవకాశం ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.
విఎస్ఏలే తనిఖీలు చేపడుతారు.
గ్రామాలలో సోమవారం నుండి ఉపాధి హామీ సామాజీక తనిఖీ ప్రారంభం అయ్యింది. తనిఖీలల్లో అధికారులు,ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదు. వీఎస్ఏలే తనిఖీలు చేపడుతారు.
