అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టైటన్స్.. సొంత మైదానంలో డిఫెండబుల్ స్కోర్ ను సాధించారు. ముంబై బౌలింగ్ అటాక్ ను ధీటుగా ఎదుర్కున్న గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు నమోదు చేసింది.
గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులతో 63) సూపర్ స్ట్రైకింగ్ తో చెలరేగాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు.
ముంబై జట్టుకు తలనొప్పిగా మారిన ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు. 8.3వ ఓవర్లో శుభమన్ గిల్ (38 పరుగులుకు) ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన జోస్ బట్లర్, సాయి సుదర్శన్‌తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని సృష్టించాడు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ముజీబ్ ఉర్ రెహమాన్ విడదీవాడు. 13.5 వ ఓవర్లో జోస్ బట్లర్ (24 బంతుల్లో 39) ఔటయ్యాడు. ఇక ఆఖర్లో వచ్చిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (18), రషీద్ ఖాన్ (6), కగిసో రబడ (7) సిక్సులు కురిపించి పెవిలియన్ చేరారు. దీంతో గుజరాత్ స్కోర్ 197 గా నమోదైంది.
ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు తలా ఒక వికెట్ తీయగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో ముంబై జట్టు 198 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగనుంది.