ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా నేడు (గురువారం) 64వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ – లక్నో సూపర్‌జెయింట్స్ తలపడనుండగా, ఈ మ్యాచ్‌కు ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా లక్నో సూపర్ జేయింట్స్ బ్యాటింగ్ చేపట్టనుంది.
దుమ్మురేపుతున్న శుభమన్ సేన..
శుభ్మన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చూపుతోంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఇక, నేటి మ్యాచ్‌లోనూ గెలుపు జెండా ఎగురవేసి… తమ ఆధిక్యతను మరింత బలపరచాలని గిల్ సేన పట్టుదలగా ఉంది.
పరువు కోసం పోరాటం..
మరోవైపు, రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్… పేలవమైన ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయినప్పటికీ, తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను విజయంతో ముగించి గౌరవంగా ఈ సీజన్‌ను ముగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీజన్ చివరి దశలోనైనా తమ సత్తా చూపించాలని రిషమ్ సేన ఆశిస్తోంది.
గుజరాత్ – లక్నో హెడ్ టు హెడ్ రికార్డు !
ఇప్పటివరకు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ – లక్నో సూపర్‌జెయింట్స్ మొత్తం 6 సార్లు తలపడ్డాయి. అయితే, ఇందులో గుజరాత్ జట్టు 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, లక్నో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. దీంతో గుజరాత్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉంది
మ్యాచ్‌లో రికార్డుల వేట
- జోస్ బట్లర్ – నరేంద్ర మోడీ స్టేడియంలో 500 ఐపీఎల్ పరుగులు పూర్తిచేయడానికి 65 పరుగుల దూరంలో ఉన్నాడు.
- రషీద్ ఖాన్ – 50 ఐపీఎల్ క్యాచ్‌లు పూర్తిచేయడానికి ఇంకా 3 క్యాచ్‌ల దూరంలో ఉన్నాడు.
- నికోలస్ పూరన్ – ఐపీఎల్‌లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి 3 సిక్సర్లే కావాల్సి ఉంది.
- ఆయుష్ బడోని – 1000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని చేరడానికి ఇంకా 37 పరుగులు చేయాల్సి ఉంది.
- రవి బిష్ణోయ్ – లక్నో తరఫున 50 వికెట్లు పూర్తిచేయడానికి 2 వికెట్లు సాధించాల్సి ఉంది.