GT vs KKR |గుజరాత్ టైటాన్స్ ఈజీ విక్టరీ

గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ను 39 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 90 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ అతనికి చక్కటి సహకారం అందిస్తూ 52 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే ఒంటరి పోరాటంతో 50 పరుగులు చేసినా.. ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోతూ విజయానికి దూరమైంది. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసి కేకేఆర్ బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాటర్ల భాగస్వామ్యం, పొదుపైన బౌలింగ్‌తో గుజరాత్ విజయం సొంతం చేసుకుంది.ఈ ఓటమి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు చాలా ఖరీదుగా మారింది. ఇప్పటికే టోర్నమెంట్‌లో సగం మ్యాచ్‌లు ముగిసిన సంగతి తెలిసిందే. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్ మిగిలిన మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమి పాలవడం కేకేఆర్ అభిమానులను నిరాశకు గురిచేసింది

ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాలి. కనీసం 5 విజయాలు సాధించడంతో పాటు తమ నెట్ రన్ రేట్‌ను కూడా మెరుగుపరచుకోవాలి. ఇతర జట్ల ఫలితాలు కూడా కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. అయితే, కేకేఆర్ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లంతా కలిసి కట్టుగా రాణిస్తేనే, కేకేఆర్ ప్లేఆఫ్స్ ఖాయమవుతాయి.

Leave a Reply