జీఎస్టీ సవరణలు

ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ సవరణలు, పలు స్లాబులు తొలగించి, అనేక వస్తువులపై ట్యాక్సులు తగ్గించారు. ఇప్పుడు రెండు ప్రధాన స్లాబులు 5% నుంచి 18% మాత్రమే, లగ్జరీ వస్తువులకు 40% వరకు. ఈ మార్పులతో రోజువారీ వస్తువులు చౌకగా అందుబాటులోకి వస్తాయి.
ఏ వస్తువు ఎంత ట్యాక్స్ ఇలా తెలుసుకోండి.
ఏ వస్తుపై ఎంత జీఎస్టీ, రాష్ట్రాల VAT(వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్) పడుతుందో సులభంగా తెలుసుకోవడానికి మనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందించింది. మై గౌట్(My gout) అనే సైట్‌లోకి వెళ్లి, ఆ వస్తువును కార్ట్‌లో యాడ్ చేసి వ్యూ కార్ట్ క్లిక్ చేస్తే, అసలు ధర, వ్యాట్(VAT), జీఎస్టీ వివరాలు తెలుస్తాయని కేంద్రం చెబుతుంది. గోధుమలు (ప్యాకేజ్డ్)పై 5% జీఎస్టీ, టామాటా సాస్‌పై 18% జీఎస్టీ పడుతుంది. QR కోడ్ స్కాన్ చేసి లేదా savingswithgst.in లింక్‌పై క్లిక్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఈ రిఫామ్‌ల వల్ల మీకు ఎంత డబ్బు ఆదా అవుతుందో కూడా తెలుసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
