శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC) నుంచి నాసా-ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ (NISAR) ఉపగ్రహాన్ని GSLV-F16 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి కీలకమైన మైలురాయిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. “ఇస్రో-నాసా సంయుక్తంగా చేపట్టిన ఈ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ – నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ప్రయోగం, అంతరిక్ష పరిశోధన చరిత్రలో చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుంది” అని ఆయన అన్నారు.
ఈ మిషన్ విజయవంతం కావడం అంతర్జాతీయ శాస్త్రీయ సహకారానికి ప్రతీకగా నిలుస్తుందని, నిసార్ మిషన్‌లో భారత శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత అంతరిక్ష ప్రయాణంలో ఇది మరో గొప్ప పురోగతిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.