మహాద్వార్ లో కళ్యాణమండపానికి భూమి పూజ..

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మహద్వార్ గ్రామంలో నూతన కళ్యాణ మండపం నిర్మాణానికి రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. ఇవాళ వేద పండితుల మంత్రోశ్చరఢల మధ్య గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తో కలిసి మహాద్వార్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి *గట్టు తిమ్మప్ప) దేవాలయం సమీపంలో కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మహాద్వార్ గట్టు తిమ్మప్ప దేవాలయం వద్ద ప్రతి ఏటా వందలాది కళ్యాణాల జరుగుతుంటాయని సరైన వసతి లేకపోవడం వల్ల ప్రజలు పెళ్లిళ్ల సమయంలో ఇబ్బందులు పడేవారని అన్నారు.

అందుకే అందరి సౌకర్యం కోసం దేవాలయం వద్ద కళ్యాణ మండపం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపిటిసి శంకర్, మాజీ జడ్పిటిసి జి.లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి .గణేష్ కుమార్, నాయకులు రాజేశ్వర్ రావు ,గాళ్ళ రాములు, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply