Greetings I కెసిఆర్ కు రేవంత్, జగన్ ల జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్ . బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. ”గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అని ఆకాంక్షించారు.
ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి – జగన్
వైసిపి అధినేత , ఎపి మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. ఈ మేరకు ట్విట్ చేశారు. ప్రజా సేవలలో నిండు నూరేళ్లు ఉండాలని ఆయన ఆకాంక్షిచారు.. ఆ భగవంతుడు మీక సంపూర్ణ ఆరోగ్యం , ఆనందం ఇవ్వాలని అభిలషించారు.. మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరారు
పొన్నం ప్రభాకర్ …
గజ్వేల్ శాసనసభ్యులు గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను! అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్ చేశారు.