Green polling | మూడో విడత.. ప్రశాంతం
Green polling | నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్‌లోని 4 మండలాలలో మూడో విడత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రీన్ పోలింగ్(Green polling) కేంద్రంలో పోలింగ్ సరళి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. డివిజన్‌లోని చెన్నారావుపేట నర్సంపేట కానాపురం నెక్కొండ మండలాలలో 11 గంటల వరకు 58.65 శాతం పోలింగ్ జరిగినట్లు డీపీఓ ప్రకటించారు.
నాలుగు మండలాలలో 1,24,555 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నడవలేని వృద్ధులను వీల్ చైర్‌లో పోలింగ్ కేంద్రాల(polling stations) వద్దకు సిబ్బంది తీసుకొచ్చి ఓటును వేయిస్తున్నారు. ఏజెన్సీలో ఉన్న రాజుపేట, ముత్యాలమ్మ తండా గ్రామపంచాయతీలో గిరిజనులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ కేంద్రం ఓటర్లను ఆకట్టుకుంది. లక్నేపల్లి గ్రీన్ పోలింగ్ కేంద్రంలో ఉత్సాహంగా ఓటు హక్కు(voting rights) వినియోగించు కొని గ్రీన్ సెల్ఫీ పాయింట్ ఓటర్లు ఫోటోలను దిగుతున్నారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని హరిత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయుటకు వస్తున్న ఓటర్ల చేతికి మెహందీ వేసి ఓటర్లకు స్వాగతం పలుకుతున్నారు.

