వెంగళ్‌రావు పార్కులో మొక్కలు నాటిన అతివలు
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
పాల్గొన్న మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని వెంగళ్‌రావు పార్క్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కొనసాగింది. కాగా, వివిధ రంగాలకు చెందిన మహిళలతో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని సంతోష్‌కుమార్ అన్నారు. రేపటి పచ్చదనం కోసం ఒక ఆశను నాటామని, ఈ చిరస్మరణీయ సందర్భంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.