బీసీ జన బాంధవుడు రేవంత్

సీఎంకు బీసీల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బీసీ జ‌న‌బాంధ‌వుడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్‌ కొనగాల మహేష్(Dr. Konagala Mahesh) అన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ వర్గాలకు 42 శాతం(42 percent for BC communities) రిజర్వేషన్ కల్పించే మహోన్నత లక్ష్యంతో ముందుకు వెళుతున్నార‌ని అన్నారు.

అలాగే కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన 2018 పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 285(Section 285 of the Panchayat Raj Act, 2018) రద్దు పరుస్తూ, ఈ రోజు తెలంగాణ శాసనసభలో చట్ట సవరణ చేసినందుకు రేవంత్ రెడ్డికి బీసీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. 42% రిజర్వేషన్(42% reservation) అమలు చేయాలని, అనుగుణంగా రిజర్వేషన్లపై 50% పరిమితిని(50% limit on reservations), నిన్నటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హ‌ర్ష‌నీయ‌మ‌న్నారు.

సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల అభ్యున్నతిపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందని అన్నారు. జనాభా దామాషా పద్ధతిని(proportional system) రిజర్వేషన్ అమలు చేస్తూ, బీసీలకు రాజ్యాధికారం అందించాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆలోచనను తూచా తప్పకుండా అమలు చేస్తున్న సీఎంకు తెలంగాణ బీసీ వర్గాలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.

Leave a Reply