చెన్నూరులో బహుజనమహనీయులకు ఘన నివాళి

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా, ఉత్సాహభరితంగా జరిగింది. పట్టణంలోని లయోలా స్కూల్‌లో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి మరియు భారతమాత ముద్దుబిడ్డ, బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకొని మహనీయులను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.వివిధ సంఘాల ప్రతినిధులు తోలుత కార్యక్రమం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం వారి జీవితాలు, త్యాగాలు, సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రసంగానాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో తొలి బలి అయిన దొడ్డి కొమురయ్య గారి త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన పోరాటస్ఫూర్తి, ధైర్యం ప్రతి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అదే విధంగా చత్రపతి శివాజీ మహారాజ్ గారి పరిపాలన, ధర్మరక్షణ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు.ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలో దొడ్డి కొమురయ్య గారి విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆయన విగ్రహం ఏర్పాటు ద్వారా యువతలో పోరాటస్ఫూర్తి పెరుగుతుందని, తెలంగాణ చరిత్రను గుర్తుచేసే ఒక ప్రేరణాత్మక చిహ్నంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఐక్యత సమాజ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఈ వర్గాలు ఒకటిగా పోరాడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ మహనీయుల ఆశయాలను కొనసాగించాలని సంకల్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ది రమేష్ యాదవ్,తరులు పాల్గొన్నారు

Leave a Reply