ఘనంగా గంగ హారతి
తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : జలాశాయలు నిండుకుండలా మారడం శుభపరిణామమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని పాపవినాశనం జలాశయం వద్ద గంగకు ఆయన ప్రత్యేకపూజలు చేసి పసుపు-కుంకుమ, పూలు, పండ్లు గంగకు నివేదించి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నాలుగు జలాశయాలు పూర్తిగా నిండాయని సంతోషం వ్యక్తం చేశారు. మరో రెండు జలాశయాలు కొంత మేర నిండాలని తెలిపారు.
భక్తుల అవసరం కోసం తిరుమలకు 50 లక్షల గ్యాలన్లు నీరు కావాలని, 25 లక్షల గ్యాలన్లు కళ్యాణి జలాశయం నుంచి వస్తుందని తెలిపారు. 250 రోజుల నీటి అవసరాలకు సరిపడే వాటర్ స్టోరేజ్ ప్రస్తుతం తిరుమలలో ఉందని తెలిపారు. డ్యామ్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ….నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ శాఖను అభినందించారు. టీటీడీ చరిత్రలో మొదటిసారిగా గడిచిన 11 నెలల్లో టీటీడీ ట్రస్ట్ లకు 918 కోట్లు విరాళాలు రావడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు.

