Govt schools | సర్పంచ్, ఉప సర్పంచ్‌కు సన్మానం
Govt schools | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : గతంలో విద్యారంగంలో పనిచేసి ఇటీవల నల్లబెల్లి నూతన సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాగేల్లి జ్యోతి ప్రకాష్, ఉపసర్పంచ్ గుమ్మడి వేణు, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్లను నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల(schools)కు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం(Govt) ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా కృషి చేయాలని వారు కోరారు. అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కర్ణకంటి రామ్మూర్తి, చందా రాజేందర్, శనిగరం శ్రీనివాస్, సతీష్,జన్ను శ్రీనివాసులు, బలరాం నాయక్, లక్కార్స్ ఈశ్వర్,మనోహర్ స్వామి, కుమారస్వామి, గ్రామస్తులు బూస లక్ష్మణమూర్తి, సాల్మన్, నన్నసాహెబ్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

