Govt School| ప్రమాణాలు పెంచేలా..

Govt School| ప్రమాణాలు పెంచేలా..

Govt School| పెనమలూరు, ఆంధ్రప్రభ : నూతన తరగతి గదుల నిర్మాణం ద్వారా విద్యార్థులకు (Students) ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా సమాజంలో ప్రమాణాలు పెంచేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పోరంకి జిల్లా పరిషత్ స్కూల్ లో అదనపు తరగతులకు గదుల నూతన నిర్మాణం కోసం రూ.41 లక్షల పిఎంఎస్ఆర్ఐ నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యాశాఖమంత్రి లోకేష్ (Education Minister Lokesh) ఆలోచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెంచేలా కృషి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధిలో రాజీలేకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply