Govt | ఉన్నత లక్ష్యంతో సాగాలి…

Govt | ఉన్నత లక్ష్యంతో సాగాలి…

Govt | బిక్కనూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు పోవాలని కామారెడ్డి జిల్లా(Kamareddy District) మానసిక వైద్యాధికారి రమణ చెప్పారు. ఈ రోజు మండలంలోని జంగంపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల(government school)లో మానసిక సమస్యలు(mental problems), మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ధైర్యంతో ముందుకు పోవాలని, మానసికంగా ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడవద్దు అని చెప్పారు. ఏదైనా ఒక సబ్జెక్టు చదివినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధైర్యంగా చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల(parents) మార్గదర్శకత్వంలో నడుచుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు.

టీనేజీ(teenage)లో వచ్చే అవరోధాలను ఆయన విద్యార్థులకు వివరించారు. మత్తు పదార్థాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదువుకున్న మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. దీనివల్ల మానసిక సమస్యలు తలెత్తి ఆత్మహత్యలకు దారితీస్తాయని చెప్పారు.

ప్రతి విద్యార్థి ధైర్యంతో ముందుకు పోవాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్( Rajendra Prasad), జిల్లా సైకియాట్రిక్స్(psychiatry) సోషల్ వర్కర్ రాహుల్, ఉపాధ్యాయులు లింబాద్రి, కిషన్ రాజు, నరేందర్, ప్రవీణ్, లింగం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply