Governor | తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం

Governor | తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం
సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
స్టాల్స్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
సంతోషంగా ఉంది : నాగార్జున అక్కినేని
Governor | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ (Telangana Global Rising Summit) 2047 ఈ రోజు ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ రోజు, రేపు ఈ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిసిందే. సమ్మిట్ ను గవర్నర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ప్రారంభించారు. తొలుత సమ్మిట్ ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క స్టాల్స్ ను పరిశీలించారు. ఇప్పటికే 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా.
సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిథుం ప్రారంభ వేడుకకు హాజరుకానుండడంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. తెలంగాణాలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, పలు దేశాల ప్రతినిధులు ప్యూచర్ సిటీకి వద్దకు చేరుకుంటున్నారు.
సదస్సులో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది: అక్కినేని నాగార్జున
తెలంగాణ ప్రభుత్వం ఫీచర్ సిటీ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’కి తమ అన్నపూర్ణ స్టూడియోస్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు.
ఫ్యూచర్ సిటీ లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఒక ప్రత్యేకమైన ‘ఫిలిం హబ్ ను ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రణాళికలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కూడా చోటు కల్పించడం పట్ల హీరో నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ సినిమా షూటింగ్‌లకు, నిర్మాణాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.
